ఏపీ వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు

ఏపీ వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశల్ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది.  విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.

 తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది.  రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు  అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో  సంబంధిత సిబ్బందిని ACB అధికారులు ప్రశ్నించారు. క్రయ, విక్రయదారుల వివరాలపై  ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు అధికారులు..

ఎన్టీఆర్ జిల్లాలోని  ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని  ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు ,విజయవాడ, నంద్యాల,ఆళ్లగడ్డ, గుంటూరు నరసరావుపేట  లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆఫీసర్లను బయటకు పంపించి రికార్డులు తనిఖీ చేస్తున్నారు.