వాళ్లు లక్షల కోట్లు సంపాదిస్తుంది ఇలానే : ఆ 5 సీక్రెట్స్ ఇవే

వాళ్లు లక్షల కోట్లు సంపాదిస్తుంది ఇలానే : ఆ 5 సీక్రెట్స్ ఇవే

భారతదేశంలో కుబేరుల సంపద మాత్రం వేగంగా పెరుగుతుంటే పేదోళ్ల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పైగా పెరిగిపోతున్న జీవన ఖర్చులతో చాలా మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో సతమతమౌతూ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. దక్షిణాఫ్రికా జీ20 ప్రెసిడెన్సీ స్టడీ ప్రకారం 2000 నుంచి 2023 మధ్య కాలంలో 1 శాతం ధనికుల సంపద 62 శాతం పెరగటానికి అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కుబేరుల సంపద వృద్ధికి వెనుకున్న కారణాలు.. 

* కార్పొరేట్ రంగానికి ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడం, ట్రేడ్ యూనియన్లు వంటి కార్మిక సంస్థల బేరమాడే శక్తిని తగ్గించడం, కార్మిక మార్కెట్ నిబంధనలను సడలించడం వంటివి వేతనాల పెరుగుదలను అణచివేస్తున్నాయి. సంపదలో అసమానతను పెంచుతున్నాయి.

* గ్లోబలైజేషన్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంది. కొన్ని వర్గాలు దీని నుంచి అధిక ప్రయోజనం పొందగా, తక్కువ నైపుణ్యాలు ఉన్న కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వీరి జీతాలు పెరగడం లేదు. 
    
* ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి సాంకేతిక మార్పులు అధిక నైపుణ్యాలు ఉన్న కార్మికులకు డిమాండ్ పెంచాయి. తక్కువ నైపుణ్యాలు ఉన్న కార్మికులకు డిమాండ్ తగ్గించాయి. ఇది వేతనాల మధ్య తేడాను పెంచింది.
    
* పన్ను రేట్లను తగ్గించడం, ముఖ్యంగా సంపన్నులకు, కార్పొరేట్లకు తగ్గించడం అసమానతను పెంచింది. ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా అమలు చేసిన కొన్ని పొదుపు చర్యలు కూడా సామాజిక భద్రతను బలహీనపరిచాయి.
    
* వారసత్వ సంపద తరతరాలుగా కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది. వారసత్వ పన్నులు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వీరి ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి.