బారామతి నుంచి కాంగ్రెస్ ఉపసంహరణ.. సునేత్ర పవార్ గెలుపు లాంఛనమే..?

బారామతి  నుంచి కాంగ్రెస్ ఉపసంహరణ.. సునేత్ర పవార్ గెలుపు లాంఛనమే..?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ గెలుపు దాదాపు ఖరారనైట్లుగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆమె భర్త, ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో ఏర్పడిన ఖాలీతో బారామతి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి దింపిన కాంగ్రెస్.. ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై గౌవరంతో పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె గెలుపు లాంఛనమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఏప్రిల్ 23న బారామతి ఉప ఎన్నికకు పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సునేత్ర పవార్ అన్ని పార్టీల నేతలను కలిశారు. అయితే పోటీ తథ్యం అని కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ప్రకటించింది. కానీ ఎన్సీపీ (ఎస్పీ) నే శరద్ పవార్, సుప్రియా సూలే విజ్ఞప్తి మేరకు.. కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. 

Also Read : తెల్లారి 3 గంటలకే చీరల కొట్టు ముందు క్యూలో లేడీస్

2026 జనవరిలో బారామతిలో విమానం దిగుతుండగా జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. అప్పుడు ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక నెల తర్వాత, ఆయన భార్య సునేత్రను ఉప ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. 

బారామతి సీటును పవార్ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. 1991 నుండి ఈ సీటును అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు. అంతకు ముందు, శరద్ పవార్ బారామతి సీటును కలిగి ఉండేవారు. ఈ తాజా చర్యతో బారామతి అసెంబ్లీ సీటు, పార్లమెంటరీ నియోజకవర్గం రెండూ పవార్ కుటుంబం చేతిలోనే ఉండనున్నాయి. సుప్రియా సూలే బారామతి ఎంపీగా ఉన్నారు.