ఇదేం జట్టురా బాబు.. పసికూన చేతిలో ఓటమా? ముందు ఆ ఇద్దర్నీ పీకేయాలన్న సన్నీ!

ఇదేం జట్టురా బాబు.. పసికూన చేతిలో ఓటమా? ముందు ఆ ఇద్దర్నీ పీకేయాలన్న సన్నీ!

India vs Ireland: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ అవమానకర ఓటమిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియన్ బౌలర్ల పేలవ ప్రదర్శన, బాధ్యతారహితమైన బ్యాటింగే ఐర్లాండ్ చేతిలో టీమిండియా తలవంచడానికి ప్రధాన కారణమంటూ విమర్శించారు. 
 
గర్వాన్ని తగ్గించుకుని క్రికెట్ ఆడండి: 

టీ20 వరల్డ్ కప్ గెలిచిన గర్వంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 182 రన్స్ చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా కేవలం 148 రన్స్ కే ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. కొత్తగా టీ20 కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమి ఎదురవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపర్చింది. 

ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ పోయింది: 

ఈ ఘోర ఓటమికి ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్ల బౌలింగ్ వైఫల్యమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రీడా పండితులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కలిసి ఐర్లాండ్ బ్యాటర్లకు ధారళంగా పరుగుల సమర్పించుకున్నారు. ఐర్లాండ్ చేసిన మొత్తం స్కోరులో దాదాపు సగం రన్స్ (76 పరుగులు) ఈ ఇద్దరి బౌలింగ్‌లోనే వచ్చాయి.  తన కోటా 4 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 57 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి ఏకంగా 19 రన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ పూర్తిగా ఫెయిల్ అయిన సుందర్ ఆటపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

వైభవ్ ఉంటే బాగుండేది: 

పసికూన ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇండియన్ ఫ్యాన్స్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ లేకపోతే భారత జట్టు ప్రపంచకప్ గెలవలేదా? అని ప్రశించాడు. కేవలం ఒక ప్లేయర్ చుట్టూ స్టోరీ అల్లడం మంచిది కాదన్నారు. మిడిల్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు పూర్తిగా లయ తప్పడమే ఈ ఘోర ఓటమికి అసలు కారణం ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ వాళ్లిద్దర్నీ పీకేయండి అని సన్నీ భాయ్ సూచించాడు.