Congress War Room Case : గంటపాటు సునీల్ కనుగోలు విచారణ

Congress War Room Case : గంటపాటు సునీల్ కనుగోలు విచారణ

వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. గంట పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం సునీల్ కనుగోలు సైబర్ క్రైం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా సీసీఎస్కు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆయన సైబర్ క్రైం విచారణకు హాజరుకాలేనని లేఖ రాసినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. అయితే వాటికి తెరదించుతూ విచారణకు హాజరయ్యారు. 

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ వార్ రూంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీసీఎస్ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వలేమని ఈ నెల 3న హైకోర్టు తేల్చి చెప్పింది. 9న సైబర్ క్రైం విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది.