సన్నీ లియోనా మజాకానా.. ఫేస్ మాస్కుగా ఏం వేసుకుందో తెలిస్తే..

సన్నీ లియోనా మజాకానా.. ఫేస్ మాస్కుగా ఏం వేసుకుందో తెలిస్తే..

కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ప్రజలు, సెలబ్రెటీలు ఇళ్లలోనే ఉండి కొత్త కొత్తగా మాస్కులను ఎలా తయారుచేసుకోవాలో చెబుతున్నారు. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుండటంతో ఏం చేయాలో తోచక.. మాస్కులను వింతవింతగా ప్రయత్నిస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

సన్నీలియోన్ కూడా ఇంట్లోనే ఉండి మాస్కులను ఏ విధంగా తయారుచేసుకోవచ్చు మరియు వేటిని మాస్కులుగా ఉపయోగించుకోవచ్చో తెలిపింది. వివిధ పద్ధతుల్లో ఫేస్ మాస్క్‌లను ధరించి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. అత్యవసర సమయంలో మీరు బయటకు వెళ్లాల్సివస్తే వేటిని మాస్కులుగా వాడుతారు అని ప్రశ్నిస్తూ.. #LockedUpWithSunny #SunnyLeone అనే శీర్షికను కూడా తన ఫొటోలకు ట్యాగ్ చేసింది.

ఒక ఫొటోలో సన్నీలియోన్ స్కార్ఫ్ ను మాస్కుగా ధరించింది. మరో ఫొటోలో తన పిల్లల డైపర్ ను మాస్కుగా ధరించింది. ఇంకో ఫొటోలో బాక్సింగ్ గ్లౌజులను మాస్కుగా వాడింది. ఇంకోదాంట్లో అయితే తన పిల్లలు ఆడుకునే టెంటును క్వారంటైన్ చేసుకున్నట్లు కూర్చుంది. అంతేకాకుండా సింహం మాస్కును కూడా ఫేస్ మాస్కుగా ఈ అందాల తార వాడింది. ఈ ఫొటోలన్నింటిని తన ఇన్‌స్టాలో పోస్టు చేయగానే ఆమె అభిమానులు లైకులు కొట్టకుండా ఎలా ఉండగలరు చెప్పండి. ఆ ఫొటోలు పెట్టి 24 గంటలు కూడా గడవకముందే 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయంటే.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో చెప్పక్కర్లేదు.

For More News..

కరోనా భయం లేకుండా.. కరోనా ఫెస్ట్.. వీడియో వైరల్

ఫాంహౌస్ లో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో నిఖిల్

వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి