
జాగ్రెబ్ (క్రొయేషియా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో.. ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ రెండు విజయాలు, ఒక ఓటమిని నమోదు చేశాడు. ర్యాపిడ్‌లో భాగంగా డుడా జాన్ క్రిస్టోఫ్ (పోలెండ్)తో జరిగిన తొలి గేమ్‌లో ఓడిన ఇండియన్ ప్లేయర్.. అలిరెజా ఫిరౌజ (ఫ్రాన్స్), ఆర్. ప్రజ్ఞానందతో జరిగిన తర్వాతి రెండు గేమ్‌ల్లో నెగ్గాడు. ఫలితంగా నాలుగు పాయింట్లతో డుడా, వెస్లీ సో, కార్ల్‌సన్‌తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
ఇక వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్.. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన గేమ్‌లో నెగ్గాడు. ఇవాన్ సారిక్, డుడాతో జరిగే గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. వెస్లీ సో.. కరువాన (అమెరికా), అనిష్ గిరి (హాలెండ్)తో జరిగిన గేమ్‌ల్లో నెగ్గాడు. గుకేశ్ చేతిలో ఓడిన ప్రజ్ఞా.. ఫిరౌజ, నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌లను డ్రాగా ముగించాడు. దీంతో రెండు పాయింట్లతో పదో ప్లేస్‌లో ఉన్నాడు. ర్యాపిడ్‌లో మరో ఆరు రౌండ్స్ మిగిలి ఉండగా, బ్లిట్జ్‌లో 18 రౌండ్స్ ఉంటాయి.