మా ప్లేస్​లో ఒక్కరోజు కూర్చుంటే మీకు తెలుస్తుంది

మా ప్లేస్​లో ఒక్కరోజు కూర్చుంటే మీకు తెలుస్తుంది
  • సుప్రీంకోర్టులో పలువురు లాయర్ల తీరుపై సీజేఐ సీరియస్​

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో పలువురు లాయర్ల తీరుపై చీఫ్​ జస్టిస్​ ఆఫ్​ ఇండియా (సీజేఐ) డీవై చంద్రచూడ్​ సీరియస్​అయ్యారు. ఒక్కరోజు తమ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అందరూ తమ కేసు విచారణ పూర్తవ్వాలని కోరుకుంటున్నారే తప్ప.. తమపై ఉన్న ఒత్తిడిని ఎవరూ గుర్తిండం లేదని అన్నారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేందుకు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాకరించడాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ శివసేన (యూబీటీ) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం విచారణ సందర్భంగా సీజేఐ ఈ కామెంట్స్​ చేశారు. శివసేన (యూబీటీ) తరఫు న్యాయవాదుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు.   

ముందుగా విచారించాలని పట్టు

ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాకరించడాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ శివసేన (యూబీటీ) సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. వాదనల తర్వాత కేసును వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది. ముందుగానే తమ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ జరపాలని లాయర్ల బృందం పట్టుబట్టడంతో సీజేఐ ఫైర్​ అయ్యారు. కాగా, కూతురి స్ఫూర్తితో తాను పూర్తి శాఖాహారిగా మారానని సీజేఐ తెలిపారు. ఢిల్లీ హైకోర్టు క్యాంపస్​లో మనోవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  రెస్టారెంట్ ఓపెనింగ్​లో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.