సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్​గా శ్రీధర్

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్​గా శ్రీధర్

హైదరాబాద్, వెలుగు : సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ (ఆన్ రికార్డ్)గా శ్రీధర్ పోతరాజు నియమితులయ్యారు. శుక్రవారం 56 మంది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లుగా అపాయింట్ కాగా.. అందులో  శ్రీధర్ తెలుగు వ్యక్తి కావడం విశేషం. హైదరాబాద్‌‌‌‌కు చెందిన శ్రీధర్ పోతరాజు.. 1997లో ఢిల్లీ బార్  కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు. ట్యాక్స్ లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

1999 నుంచి  2001 వరకు ప్రస్తుత సుప్రీం జడ్జి పీఎస్ నరసింహ దగ్గర ప్రాక్టీస్ చేశారు. 2006లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా అపాయింట్ అయ్యారు. రెండు దశాబ్దాలుగా లా ఫీల్డ్​లో కీలకంగా వ్యవహరించారు. శ్రీరామ జన్మభూమి కేసులో 36 వేల పేజీల డాక్యుమెంట్లను  డిజిటలైజ్​ చేసి భద్ర పరిచారు. గూగుల్ ఇండియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో  విశాక ఇండస్ట్రీస్ తరఫున ఆయన వాదించారు.