న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో ప్రతిపాదిత మెట్రో రైల్ ఫేజ్ – 2 ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని చెప్పింది. మెట్రో రైల్ ఫేజ్ –2 (ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట) నిర్మాణం వల్ల 150 చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లుతుందని ఏసీటీ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తొలుత హైకోర్టును ఆశ్రయించింది.
పాతబస్తీలోని చార్మినార్, ఫలక్‌నుమా వంటి సున్నితమైన ప్రాంతాల గుండా మెట్రో రైల్ మార్గం వెళ్తోందని పిటిషన్‌లో పేర్కొంది. హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అనుమతుల వివరాలను సమర్పించాలని హెచ్ఏఎంఆర్ఎల్‌ను ఆదేశించింది.
