భర్త లేదా అత్తింటివారి నుంచి వేధింపులకు గురైన మహిళలు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు నమోదు చేయచ్చు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సెక్షన్ సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుందని సంచలన తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టం కూడా మార్పు చెందాలని, సహజీవనంలో ఉంటూ వేధింపులను ఎదుర్కొంటున్నవారికి రక్షణ కల్పించాలని పేర్కొంది సుప్రీంకోర్టు. పెళ్లి ఉద్దేశంతో సహజీవనంలో కొనసాగుతున్నవారికి కూడా ఈ సెక్షన్ వర్తిస్తుందని పేర్కొంది కోర్టు.
ఈ చట్టం కేవలం వివాహమైనవారికే పరిమితం కాకుడాడని... అటువంటి సంబంధాలు వివిధ రూపాల్లో ఉండచ్చని..లివింగ్ లో ఉన్న పార్ట్నర్స్ తప్పనిసరిగా ఒక పురుషుడు, ఒక మహిళా అయ్యుండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
సెక్షన్ 498A కింద భర్త లేదా అతని బంధువులు మహిళను వేధింపులకు గురిచేసినందుకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాను విధిస్తుంది కోర్టు.
ఈ చట్టం ప్రకారం, ఒక మహిళను ఆత్మహత్యకు పురికొల్పే అవకాశం ఉన్న ప్రవర్తన, తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం, వరకట్నంతో సహా ఆస్తి, విలువైన సెక్యూరిటీ కోసం చట్టవిరుద్ధమైన డిమాండ్లను బలవంతంగా రాబట్టే లక్ష్యంతో వేధించడం వంటివి నేరంగా పరిగణిస్తుంది కోర్టు.
