కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ భార్యకు పలు పాస్ పోర్టులు ఉన్నాయంటూ ఆమెపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. గౌహతి పోలీసులు పవర్ ఖేరాపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై హైదరాబాద్ వచ్చిన అసోం పోలీసుల తీరుకు నిరసనగా.. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు పవన్ ఖేరాకు అరెస్ట్ కాకుండా బెయిల్ మంజూరు చేసింది.
పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ.. అసోం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై 2026, ఏప్రిల్ 15వ తేదీన విచారణ చేసిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే విధించింది. ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టుకు పరిధి లేదని అసోం పోలీసులు వాదించటంతో.. సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా.. తనకు మధ్యంతర బెయిల్ కావాలి అనుకుంటే అసోంలోని కోర్టులో పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని.. ఈ స్వేచ్ఛ ఆయనకు ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
అసోం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు పలు పాస్ పోర్టులు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో సీఎం వెల్లడించలేదని.. ఆమెకు విదేశాల్లో ఆస్తులు కూడా ఉన్నాయని పవన్ ఖేరా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఆరోపణలు అవాస్తవం అని.. పవన్ ఖేరాపై అసోం రాజధాని గౌహతిలో కేసు నమోదు చేశారు ఆమె. ఈ కేసుపై పవన్ ఖేరా.. తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే విధించింది సుప్రీంకోర్టు.
►ALSO READ | బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

