కులగణనకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు..జనగణనలో కులాల జనాభా లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్

కులగణనకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు..జనగణనలో కులాల జనాభా లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది.. జనాభాగణనలో కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జనాభా గణనలో కుల గణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.ఈ అంశం ప్రభుత్వ విధానపరిధిలోకి వస్తుందని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ , విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  జనాభా గణనలో కుల గణనను మినహాయించాలని సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

జనాభా లెక్కింపులో కులాల వారీగా వివరాలు సేకరించడం అనేది ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం అని CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ పరిధిలోని ఈ అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చిచెప్పింది. వెనుకబడిన వర్గాల ప్రజలు, పేదలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని, వారికి సంక్షేమ పథకాలను అందించడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.