సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేధింపులపై ప్రశ్నించినందుకు కత్తితో ప్రిన్సిపాల్ దాడి

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేధింపులపై ప్రశ్నించినందుకు కత్తితో ప్రిన్సిపాల్ దాడి
  •     ఇద్దరికి తీవ్ర గాయాలు
  • పాండుబస్తీ ఏవీ మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఘటన

కుత్బుల్లాపూర్, వెలుగు: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న వివాదం కత్తిపోట్లకు దారితీసింది. సూరారం పాండుబస్తీలోని ఏవీ మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో శీతల్ అనే మహిళ టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తోంది. ప్రిన్సిపాల్ డేనియల్ రాజ్ తనను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో శనివారం ఆమె సోదరుడు అనిల్, కొంతమంది బీజేపీ నాయకులతో కలిసి స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ను నిలదీశాడు. 

ఆ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ డేనియల్ రాజ్ పేపర్లు కట్ చేసే కత్తితో దాడి చేయడంతో అనిల్, మరో టీచర్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహిళను వేధించి, దాడికి పాల్పడిన ప్రిన్సిపల్ డేనియల్ రాజ్‌‌‌‌‌‌‌‌తోపాటు, పాఠశాలపై దాడి చేసిన అనిల్, గణేశ్, శ్రీరాములుపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.