అంబులెన్స్ను ఢీకొట్టిన బైక్.. ఏడుగురికి గాయాలు.. గోదావరిఖని వద్ద ఘటన

అంబులెన్స్ను ఢీకొట్టిన బైక్.. ఏడుగురికి గాయాలు.. గోదావరిఖని వద్ద ఘటన

గోదావరిఖని, వెలుగు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తుండగా బైక్ ఢీకొట్టడంతో అంబులెన్స్ బోల్తా పడింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఐదుగురికి, బైక్ పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదం గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాలలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని అంబులెన్స్ లో వరంగల్​ఎంజీఎం హాస్పిటల్​కు తరలిస్తున్నారు.

శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలోని బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా బైక్​ఢీకొట్టడంతో అంబులెన్స్​అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ సతీశ్, అందులో ఉన్న పవన్, సుధీర్, రమక్క, కవితతో పాటు బైక్​పై ఉన్న ఎస్ కే. మోహినోద్దీన్, ఎండీ. పర్వేజ్ కు గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న గోదావరిఖని వన్​టౌన్​ఇన్​స్పెక్టర్​ఎ.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ లో ఉన్న వారిని గోదావరిఖని ఏరియా హాస్పిటల్​కు, మోహినోద్దీన్, పర్వేజ్​ను కరీంనగర్ హాస్పిటల్​కు తరలించారు. అంబులెన్స్​ ఓనర్​వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.