గ్రామీణ ఉపాధి పనులు పెంచండి : మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌

గ్రామీణ ఉపాధి పనులు పెంచండి : మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు దారుణంగా పడిపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌‌ విమర్శించారు. ఉపాధి పనుల తగ్గుదలకు కేంద్రాన్ని నిందించడం మానేసి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌‌ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. 2024–25లో 1,222.87 లక్షలుగా ఉన్న పనిదినాలు 2025–26లో 731.63 లక్షలకు తగ్గాయని తెలిపారు.

వంద రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు 92,688 నుంచి 23,228కు పడిపోయాయని పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడంతోపాటు పనిదినాలను 125 రోజులకు పెంచిందన్నారు. తెలంగాణకు రూ.3,825.31 కోట్లు కేటాయించగా, తొలి విడతగా రూ.1,263.41 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ జాబ్‌‌ కార్డులు ఇవ్వాలని  డిమాండ్‌‌ చేశారు.