28, 29 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్

28, 29 తేదీల్లో తెలుగు వర్సిటీ  ఎంట్రెన్స్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఈ నెల 28,29 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ ప్రకటించింది. బీఎఫ్ఏ, ఎంపీఏ డ్యాన్స్, ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, ఎంఏ హిస్టరీ, కల్చరల్​అండ్ టూరిజం కోర్సు ఎగ్జామ్11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. 

ఈ నెల 29న ఎంఏ తెలుగు పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు, ఎంఎఫ్ఏ కోర్సు ఎగ్జామ్11 గంటల నుంచి 12 గంటల వరకు, ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సు ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30గంటల వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. పరీక్షలన్ని బాచుపల్లిలోని వర్సిటీ ఆవరణలో ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 22 నుంచి www.pstucet.org వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.