"కంగువా" అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి

"కంగువా" అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి

కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సూర్య..  తాజాగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తున్నాడు. ‘శౌర్యం’ ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తుండగా, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆదివారం ఈ చిత్రానికి ‘కంగువా’ అనే టైటిల్‌‌ను ప్రకటించారు. ‘కంగువా’ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి అని అర్థం. అలాగే అత్యంత పరాక్రమవంతుడిగా పిలుస్తారు.

 పది భాషలతో పాటు  త్రీడీలోనూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి అన్ని భాషల వారు కనెక్ట్ అయ్యేలా ఈ టైటిల్‌‌ను ఫిక్స్ చేసినట్టు తెలియజేశారు మేకర్స్. సూర్య నటిస్తోన్న 42వ చిత్రమిది. దిశా పటాని హీరోయిన్. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. మ‌‌రో నెల‌‌లో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయ‌‌నున్నారు. త్రీడీ, వీఎఫెక్స్‌‌కి ఎక్కువ సమయం పడుతుంది కనుక.. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందులో సూర్య చాలా గంభీరంగా కనిపిస్తాడని, అందరికీ గుర్తిండిపోయే చిత్రమవుతుందన్నాడు దర్శకుడు శివ.