మేడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మేడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డా.సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ స్టూడియోలో శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది.  ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్  తెలియజేశారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ ‘అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టరేట్ చేశా. అక్కడొక కంపెనీ ప్రారంభించా.

మన దేశం కోసం ఏమైనా చేయాలనిపించి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. అక్కడి  ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమానంగా అభివృద్ధి చేశా. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నా.  ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను  సినిమా ద్వారా చూపించాలనిపింది. అందుకే ఈ చిత్రాన్ని ప్రారంభించా.  కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంటుంది. యువతకు బాగా కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది.  ఇది పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా కాదు.. పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ’ అని చెప్పారు. సుహాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీరా మాటలు, స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.కొండకండ్ల  సంగీతం అందిస్తున్నారు.