హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ల దందా..ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. 400 సిలిండర్లు సీజ్

హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ల దందా..ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. 400 సిలిండర్లు సీజ్


హైదరాబాద్లో  గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న  భారీ ముఠాను  గుట్టును రట్టు చేశారు. ఒక సిండికేట్‌గా ఏర్పడి, నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న ఈ చీకటి వ్యాపారంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

అఫ్జల్ గంజ్ ప్రాంతానికి చెందిన మెట్రో హెచ్‌పీ (HP) గ్యాస్ డీలర్ అమీర్ ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను ఏకంగా 6 వేల రూపాయలకు పైగా ధర పలికిస్తూ.. హోటళ్లు, రెస్టారెంట్లకు అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ ముఠా గత కొంతకాలంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. సుమారు 400 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక్కోటి 19 కేజీల బరువున్న సిలిండర్లు ఉన్నాయి.  ఈ  దందాలో  ప్రధాన సూత్రధారి డీలర్ అమీర్‌తో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వివరాల ప్రకారం. .‘బ్లాక్ గ్యాస్ దందా ముఠాకు చెక్ పెట్టాం. 10మంది నిందితులను అరెస్ట్ చేశాం, 414 గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాం.  శంషాబాద్ లో గ్యాస్ గోదాము, అఫ్జల్ గంజ్ లో గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తూ  మహమ్మద్ అమీర్ గ్యాస్ దందా చేస్తుండు.  మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరుతో అమీర్ రెగ్యులర్ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ అమ్ముతున్నారు. 2100 గ్యాస్ ధర ఉంటే రూ 6 వేలకు బ్లాక్ దందా చేస్తూ అమ్ముతున్నారు.  పంజాగుట్ట గ్రేవ్ యార్డులో డంప్ చేసి ఇల్లీగల్ బ్లాక్ దందా చేస్తున్నారు. కమర్షియ బిజినెస్ వల్ల ఇబ్బందులు ఆసరాగా చేసుకొని ఈ దందా చేస్తున్నారు. దేశంలో ఎక్కడ గ్యాస్, ఇంధన కొరత లేదు.. ప్రజలను భయాందోళన చెందవద్దు. ప్యానిక్ చేస్తే కరోనా చర్యలుంటాయి.. తప్పుడు రూమర్స్ క్రియేట్ చేస్తే చర్యలుంటాయి. బ్లాక్ మార్కెటింగ్ లో గ్యాస్, పెట్రోల్ ప్రొడక్ట్స్ అమ్మితే పోలీసులకు తెలపండి.  కమర్షియల్, హోటల్ రెస్టారెంట్లే టార్గెట్ గా ఈ దందా బ్లాక్ గా గ్యాస్ అమ్ముతున్నారని’ వెల్లడించారు.