త్వరలో మోడల్ హౌసింగ్ కాలనీ నిర్మాణాలు పూర్తి: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

త్వరలో మోడల్ హౌసింగ్ కాలనీ నిర్మాణాలు పూర్తి: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్, వెలుగు: త్వరలో మోడల్ కాలనీలో చేపట్టిన నిర్మాణాలు పూర్తి అవుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.  బుధవారం హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కమ్యూనిటీ హాల్, పబ్లిక్ టాయిలెట్స్, అంగన్​వాడీ సెంటర్, ప్లే ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్, మౌలిక వసతుల నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి క్వాలిటీతో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇండ్ల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా1,805 అర్హులైన లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేసినట్టు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకే మోడల్ హౌసింగ్ కాలనీలో ఇండ్లు అందజేస్తామని చెప్పారు.  

అనంతరం పట్టణంలోని లైబ్రరీని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. లైబ్రరీ అభివృద్ధికి రూ.2 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తరువాత లక్కవరంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ సతీశ్, ఏఓ స్వర్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు