మీరు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారా.. ? : సుష్మితాకు నెటిజన్ల ప్రశ్న

మీరు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారా.. ? : సుష్మితాకు నెటిజన్ల ప్రశ్న

భారత మొదటి విశ్వసుందరి సుష్మితాసేన్ 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందంటూ ఇన్ స్టాలో షేర్ చెసింది. 13ఏళ్లుగా తనను ఈ నంబర్ వెంటాడుతోందన్నారు. ఈ విషయం తనకు ఎప్పడో తెలుసని, ఇప్పుడు దాన్ని వెల్లడిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు. దాంతో పాటు సూర్య కిరణాలు పడుతున్నట్టుగా ఉన్న ప్రాంతంలో, స్టైలిష్ కళ్లద్దాలతో దిగిన ఫొటోను ఆమె జత చేసింది. దీంతో సుష్మితా ఫ్యాన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకో ముఖ్య విషయమేమిటంటే.. కొందరు నెటిజన్లు మాత్రం.. మీరు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారా అని ప్రశ్నించడం అందర్నీ ఆకర్షిస్తోంది. 

1994లో 18 ఏళ్లకే విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న సుష్మితా సేన్.. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. నిజ జీవితంలోనూ బోల్డ్ డిసిషన్స్ తీసుకుంటారని సుష్మితా సేన్ కు పేరుంది. 2015 నుంచి బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ మాజీ విశ్వసుందరి.. 2020లో ఓటీటీలోకి ప్రవేశించింది. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ కథ ఆధారంగా రూపొందిస్తున్న తొలి చిత్రంలో ట్రాన్స్ జెండర్‌గా నటిస్తోంది. హీరోలు ట్రాన్స్ జెండర్లుగా నటించి మెప్పించిన సందర్భాలున్నాయి. కానీ ప్రముఖ హీరోయిన్ అందులో మాజీ విశ్వసుందరి ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్న చిత్రమని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.