నువ్వు గుండెల్లో ఉన్నావ్, ఐలవ్యూ.. ఉద్యోగినితో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్

నువ్వు గుండెల్లో ఉన్నావ్, ఐలవ్యూ.. ఉద్యోగినితో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్, నటుడు పృథ్వీ  ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియో రికార్డ్ లో  ఏముందంటే..నువ్వంటే ఇష్టం.., నువ్వు నా గుండెల్లో ఉన్నావ్.. ఐ లవ్యూ అని ఉద్యోగినితో అన్నారు. ప్రస్తుతం తాను మద్యం మానేసానని..ఒక వేళ తాగితే నీతో కూర్చొని తాగుతా అని ఆమెతో అన్నారు. మీ రూమ్ కు వచ్చి వెనకనుంచి  గట్టిగా వాటేసుకుందామనుకున్నా కానీ భయపడి ఎక్కడ అరుస్తావోనని వాటేసుకోలేదన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకిష్టమో తెలీదని ఐలవ్యూ అని  ఉద్యోగినితో మాట్లాడిన  పృథ్వీ కాల్ రికార్డ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.