చెత్త సేకరణను ‘రాంకీ’కి అప్పగించొద్దు... స్వచ్ఛ ఆటో కార్మికుల డిమాండ్

చెత్త సేకరణను ‘రాంకీ’కి అప్పగించొద్దు... స్వచ్ఛ ఆటో కార్మికుల డిమాండ్
  • అసెంబ్లీ ముట్టడికి యత్నం

అబిడ్స్, వెలుగు: చెత్త సేకరణను తమతోనే చేపట్టాలని, ఆ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించొద్దని స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శనివారం అసెంబ్లీని ముట్టడించేందుకు బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

మహిళా కార్మికులు లక్ష్మి, సరోజ, జయమ్మ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పనిని కాంట్రాక్టు సంస్థ రాంకీకి అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.