శ్రేయాంక పాంచ్​ పటాకా

శ్రేయాంక పాంచ్​ పటాకా
  •    3 ఓవర్లలో 2 రన్స్​ ఇచ్చి 5 వికెట్లు 
  •    హాంకాంగ్​పై  ఇండియా విక్టరీ
  •    విమెన్స్​ ఎమర్జింగ్​ ఆసియా కప్​

మోంగ్‌‌కోక్‌‌ (హాంకాంగ్): విమెన్స్‌‌ ఎమర్జింగ్‌‌ ఆసియా కప్‌‌ టీ20 టోర్నీని ఇండియా గ్రాండ్‌‌ విక్టరీతో షురూ చేసింది. యంగ్‌‌ ఆల్‌‌ రౌండర్‌‌ శ్రేయాంక పాటిల్‌‌ (5/2)  మూడు ఓవర్లలో రెండే రన్స్‌‌ ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టడంతో మంగళవారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో ఇండియా–ఎ టీమ్‌‌ 9 వికెట్ల తేడాతో హాంకాంగ్‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన హాంకాంగ్‌‌ 14 ఓవర్లలో 32 రన్స్‌‌కే ఆలౌటైంది. ఓపెనర్ మరికో హిల్‌‌ (14) మాత్రమే డబుల్‌‌ డిజిట్‌‌ స్కోరు చేసింది.

విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో ఆర్సీబీ తరఫున సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసిన ఆఫ్‌‌ స్పిన్నర్‌‌  శ్రేయాంక దెబ్బకు టీమ్‌‌లో నలుగురు డకౌటవగా.. మరో ఆరుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితం అయ్యారు. ఇండియా అండర్‌‌19 వరల్డ్‌‌ కప్‌‌ స్టార్స్‌‌ మన్నత్‌‌ కశ్యప్‌‌ (2/2), పార్శవి చోప్రా (2/12) కూడా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌కు వచ్చిన ఇండియా 5.2 ఓవర్లలోనే 38/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. హైదరాబాదీ గొంగడి త్రిష (19 నాటౌట్‌‌) సత్తా చాటింది. శ్రేయాంకకు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌లో నేపాల్‌‌తో ఇండియా తలపడనుంది.