నైనా జైస్వాల్ను వేధించిన వ్యక్తి అరెస్ట్

నైనా జైస్వాల్ను వేధించిన వ్యక్తి అరెస్ట్

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్‌ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడు.  సోషల్ మీడియాలో నైనా జైస్వాల్‌ను శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్లో నైనా జైస్వాల్కు అసభ్యకర మెసేజ్ లు పంపడంతో...ఆ యువకుడిపై నైనా జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. నైనా ఫిర్యాదుతో పోలీసులు యువకుడు శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ షీ టీమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పటికీ నైనా కు వేధింపులు తప్పలేదని ఆమె తండ్రి అశ్విన్ జైస్వాల్ తెలిపారు. గతంలోనే శ్రీకాంత్ అనే యువకుడు సామాజిక మాధ్యమంలో నైనాను వేధింపులకు గురిచేశాడని..ఆ సమయంలో సిద్దిపేట పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారని చెప్పారు. అయినా నిందితుడిలో మార్పు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైం,సిటీ పోలీసులకు కంప్లేయింట్ ఇచ్చామన్నారు. తెలంగాణ పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని..నిందితుడి శ్రీకాంత్ ను కఠిన శిక్షిస్తారనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు  సవాల్ తీసుకోవాలని కోరారు. అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలను కఠినంగా శిక్షించాలని కోరారు. 

హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్  టేబుల్ టెన్నిస్ లో  స్టార్ ప్లేయర్. నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఆమె అనేక టైటిల్స్ ను సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో  జైస్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కావడంతో అప్పుడే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.