నా అదృష్టం ఇప్పటివరకు నాకు అలాంటివి ఎదురవలేదు

నా అదృష్టం ఇప్పటివరకు నాకు అలాంటివి ఎదురవలేదు

గతేడాది ప్రారంభమైన మీటూ ఉద్యమం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిందే. తనని నటుడు నానాపటేకర్ లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా సంచలన ఆరోపణలు చేసింది.  బాలీవుడ్ లో ప్రారంభమైన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఊపందుకుంది. తనుశ్రీకి మద్దతుగా పలువురు నటీనటులు మద్దతు పలికారు. తనుశ్రీదత్తా మీటూ ఉద్యమం తరువాత ఫిల్మిం ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పలువులు బహిరంగంగా భయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మీటూ ఉద్యమం పై మిల్కీబ్యూటీ తమన్నా స్పందించింది. కెరియర్ లో తాను ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొలేదని చెప్పింది. లైంగిక వేధింపుల ఎదుర్కొంటున్నవారు ప్రతిఘటించాలని వ్యాఖ్యానించింది. అయితే మీటూ ఉద్యమంపై స్పందించిన వారికి అవకాశాలు దక్కకపోవడం విచారమని అసంతృప్తి వ్యక్తం చేసింది తమన్నా.