హిందీ మాట్లాడేవాళ్లు శూద్రులవుతారా ?

హిందీ మాట్లాడేవాళ్లు శూద్రులవుతారా ?

‘‘హిందీ మాట్లాడే వాళ్లు శూద్రులుగా మారిపోతారు’’ అంటూ డీఎంకే ఎంపీ టి.కె.ఎస్.ఎలంగోవన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మండిపడ్డారు. భాషను ప్రాతిపదికగా చేసుకొని దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా ముక్కలు చేసే ప్రయత్నాన్ని డీఎంకే చేస్తోందని ఆరోపించారు. హిందీ అనేది వెనుకబడిన రాష్ట్రాల భాష అంటూ ఎలంగోవన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవికత లేదని పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హిందీ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని నారాయణన్ తిరుపతి  అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.

‘‘ బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి వెనుకబడిన రాష్ట్రాలలో మాతృభాష హిందీ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వైపు ఒకసారి చూడండి. అవన్నీ ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుసు కదా. ఈ అభివృద్ధిచెందిన రాష్ట్రాల్లో మాతృభాష హిందీ కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. హిందీ మనల్ని శూద్రులుగా మార్చుతుంది. అందుకే ఆ భాషను మాట్లాడటం సరికాదు’’ అంటూ ఇటీవల   డీఎంకే ఎంపీ టి.కె.ఎస్.ఎలంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు..

కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు చేయం

హ్యాపీ బర్త్ డే రహానే