హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. విజయవాడ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ట్యాంకర్ గుజరాత్ నుంచి చెన్నైకు వెళ్తున్నట్లు గుర్తించారు.
