తెలంగాణ డెవలప్​మెంట్లో కేసీఆర్ విఫలం

తెలంగాణ డెవలప్​మెంట్లో కేసీఆర్ విఫలం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డెవలప్ మెంట్ లో కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. తెలంగాణ మోడల్ పై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత స్పీచ్​పై ఆయన పైవిధంగా స్పందించారు. కేసీఆర్ వైఫల్యాన్ని కవిత అంతర్జాతీయ వేదికపై చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ మోడల్ గురించి చెప్పడానికి రూలింగ్ పార్టీ లీడర్ ను కాకుండా ప్రతిపక్ష లీడర్ ను ఇన్వైట్ చేయాల్సిందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. 

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్, లిక్కర్ పాలసీ ద్వారా వేల కోట్లు దోచుకోవటం, సర్కారు స్కూళ్లలో టీచర్లు లేకపోవటం, తెలంగాణలో ఉన్న వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలను కేసీఆర్ నిర్వీర్యం చేయటం, గత తొమ్మిదేండ్లలో జరిగిన అవినీతి, కుటుంబపాలన, కేసీఆర్  కుటంబ ఆదాయం పెంచుకోవటం, పబ్లిక్ ను విడదీయటం వంటి అంశాల గురించి మాట్లాడి ఉండాల్సిందని తరుణ్ చుగ్ సూచించారు.