
కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న నూతన స్కిల్ సెంటర్ స్థలాన్ని టాస్క్ బృందం సీఈఓ శ్రీకాంత్ సిన్హా టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కిల్ సెంటర్ ద్వారా స్థానిక యువతకు కంప్యూటర్ శిక్షణ, టెక్నికల్ కోర్సులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు.
నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల యువతకు మంచి అవకాశాలు కల్పించడమే కల్వకుర్తిలో ఏర్పాటు చేయబోయే స్కిల్ సెంటర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్ రీజినల్ హెడ్ సవీన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ షానావాజ్ ఖాన్, రజియా బేగం ఐక్యత ఫౌండేషన్ సభ్యులు జైపాల్ రెడ్డి, రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, గణేశ్, శ్రీపతి, శేఖర్, శ్రీను పాల్గొన్నారు.