వనపర్తి, వెలుగు : గత 7రోజులుగా విద్యుత్తు ఆర్టీజన్, పీస్ రేట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
మంగళవారం సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ఉద్యోగులను విద్యుత్తు శాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేశారని, కానీ నేటికీ ప్రభుత్వం వారి ముఖ్యమైన కోర్కెలు తీర్చకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విడిపోయారని అన్నారు. వెంటనే తెలంగాణ విద్యుత్తు ఆర్టీజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారి న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ ఉన్నారు.

