V6 News

స్టూడెంట్స్ ను చితకబాదిన ప్రిన్సిపాల్...జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

స్టూడెంట్స్ ను చితకబాదిన ప్రిన్సిపాల్...జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్  చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపాల్  చితకబాదిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. టెన్త్  విద్యార్థులు సోమవారం పరీక్షలు రాయడానికి వెళ్లారు. అదే సమయంలో స్కూల్​లోని కొంత మంది స్టూడెంట్స్​ టెన్త్​ స్టూడెంట్ల డార్మెటరీలోకి వెళ్లి పెట్టెలను ధ్వంసం చేశారనే కారణంతో ప్రిన్సిపాల్  వారిని రక్తం వచ్చేలా కొట్టాడు. 

ఈ విషయమై ప్రిన్సిపాల్  రామకృష్ణను వివరణ కోరగా 7, 8 తరగతుల విద్యార్థులు టెన్త్​ స్టూడెంట్ల డార్మెటరీలోకి వెళ్లి వాళ్ల పెట్టెల తాళాలను ధ్వంసం చేశారని చెప్పారు. నోట్ బుక్స్, పుస్తకాలు, డబ్బు దొంగలించడంతో కొట్టినట్టు తెలిపారు.