వనపర్తి, వెలుగు : ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపాల్ అంబటి వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బైపీసీలో ఉజ్మా హజారా 438 మార్కులతో 2వ ర్యాంకును, అదే విధంగా బైపీసీలో హెచ్.అనుష్ణ 994 మార్కులతో ఉమ్మడిజిల్లా 1వ ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారని కాలేజీ ప్రిన్సిపాల్ అంబటి వినోద్‌కుమార్ తెలిపారు.
మంగళవారం కాలేజీకి వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్టేట్ ర్యాంకర్లను సన్మానించారు. అదే విధంగా జేఈఈ మెయిన్స్ -2026 ఫలితాల్లో సీహెచ్.అర్జున్ 91.69 పర్సంటైల్ తో జిల్లాలో అగ్రగామిగా నిలిచాడని, జిల్లాలో ఇంటర్ తో పాటు జేఈఈ , నీట్, ఈఏపీసెట్ లలో కూడా కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా జాగృతి కాలేజీ నిలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యజమాన్య సభ్యులు భాస్కర్, శ్యామ్ కుమార్ , సత్యనారాయణ లను ప్రత్యేకంగా అభినందించారు.

