ఐఫోన్ల అసెంబ్లింగ్.. తైవాన్ కంపెనీతో టాటా గ్రూప్ చర్చలు

ఐఫోన్ల అసెంబ్లింగ్..  తైవాన్ కంపెనీతో టాటా గ్రూప్ చర్చలు

యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్లను ఉత్పత్తి చేసే తైవాన్ కంపెనీ విస్ట్రాన్ కార్ప్ తో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ బదిలీకి సంబంధించి విస్ట్రాన్ కార్ప్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ రెండు సంస్థల మధ్య డీల్ కుదిరితే.. ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది. 

ప్రస్తుతం తైవాన్ కు చెందిన విస్ట్రాన్, ఫాక్స్ కాన్ కంపెనీలు చైనా, భారత్ లలో యూనిట్లు ఏర్పాటు చేసి ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఐఫోన్ల ఉత్పత్తికి చైనా హబ్ గా ఉంది. ఒకవేళ ఈ విభాగంలోకి టాటా గ్రూప్ లాంటి భారత అగ్ర కంపెనీలు కూడా అడుగు పెడితే చైనాకు పోటీ పెరుగుతుంది.