
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నష్టం ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో తగ్గింది. కంపెనీకి కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ. 243.77 కోట్ల నష్టం (కన్సాలిడేటెడ్) వస్తే ఈసారి రూ.50.06 కోట్లు వచ్చాయి. రెవెన్యూ రూ. 1,485.73 కోట్ల నుంచి రూ.1,266.65 కోట్లకు పడిపోయింది. సేల్స్ పెరగడంతో కంపెనీ నష్టాలు తగ్గాయని, పనితీరు మెరుగుపడిందని ఇండియా సిమెంట్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ సిమెంట్, క్లింకర్ వాల్యూమ్ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 24.36 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ 27.85 లక్షల టన్నులుగా ఉంది.
వర్కింగ్ క్యాపిటల్ వాడడంతో కంపెనీ కెపాసిటీ మెరుగుపడిందని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. ఖర్చులు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.1,351.84 కోట్లుగా రికార్డయ్యాయి. కింటేడాది ఇదే టైమ్‌లో కంపెనీ ఖర్చులు రూ.1,637.65 కోట్లుగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా సిమెంట్స్‌కు రూ. 215.76 కోట్ల నష్టం, రూ.5,112.24 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.169.82 కోట్ల నష్టాన్ని, రూ.5,608.14 కోట్ల రెవెన్యూని ఇండియా సిమెంట్స్ ప్రకటించింది.