- జిల్లా కేంద్రంలో 3 సెంటర్లలో నిర్వహణ
- కో - ఆర్డినేటర్ ఎం. పరమేశ్వర్
వికారాబాద్, వెలుగు : పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను 24న నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా కో –ఆర్డినేటర్ ఎం. పరమేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. వికారాబాద్ టౌన్ లో 3 సెంటర్లలో నిర్వహిస్తున్నట్టు, జిల్లాకు చెందిన 1,321 అభ్యర్థులకు ఎగ్జామ్ కు హాజరవుతుండగా..
కొంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 240 మంది, ఎన్నెపల్లి లోని భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ లో 600 మంది, శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కాలేజీలో 481 మందికి కేటాయించినట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగానే సెంటర్ కు చేరుకోవాలని, 11 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం లేటైనా ఎగ్జామ్ కు పర్మిషన్ లేదని స్పష్టంచేశారు.
