మా సమస్యలు పరిష్కరించండి.. మంత్రి వివేక్‌‌కు సింగరేణి రిటైర్డ్‌‌ ఉద్యోగుల వినతి

మా సమస్యలు పరిష్కరించండి.. మంత్రి వివేక్‌‌కు సింగరేణి రిటైర్డ్‌‌ ఉద్యోగుల వినతి

కోల్​బెల్ట్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్‌‌ ఉద్యోగులు మంత్రి వివేక్‌‌ వెంకటస్వామిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌‌లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్​ వెల్ఫేర్​ అసోసియేషన్ ​అధ్యక్షుడు దండం రాజు రాంచందర్‌‌‌‌ నేతృత్వంలో రిటైర్డు ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి రిటైర్డ్‌‌ ఉద్యోగులకు అంతంతమాత్రంగానే వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, పెన్షన్‌‌ పెంచేలా ఒత్తిడి తేవాలని మంత్రిని కోరారు. 

సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో రిటైర్డ్‌‌ ఉద్యోగులకు ఔట్‌‌ పేషెంట్‌‌, హైదరాబాద్‌‌ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న రూ.8 లక్షల వైద్య సౌకర్యాలకు అదనంగా మరో రూ.2లక్షల కవరేజ్‌‌​ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వివేక్..  రిటైర్డ్‌‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, సంక్షేమ అవసరాలను కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రిటైర్డ్‌‌ ఉద్యోగులకు సింగరేణి ఆస్పత్రులతోపాటు హైదరాబాద్‌‌లో ఔట్‌‌ పేషెంట్‌‌ వైద్య సదుపాయాల కల్పనపై, వైద్య సౌకర్యాలకు మరో 2 లక్షల కవరేజ్‌‌పై సింగరేణి కొత్త సీఎండీ కృష్ణ భాస్కర్‌‌‌‌ను కలిసి మాట్లాడ్తానని భరోసా ఇచ్చారు.