మల్కాజిగిరి, వెలుగు: నేరేడ్మెట్ కు చెందిన గోల్ల దీప అలియాస్పద్మ, ఆమె ముగ్గురు పిల్లలు అఖిల్, చైత్రవి, యశ్వంత్ కృష్ణ అదృశ్యమైనట్లు సీఐ సందీప్ తెలిపారు. దీప ఈ నెల 1న భర్త వీరేశ్తో గొడవ పడింది. మరుసటి రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పిల్లలను తీసుకొని సైనిక్ పురిలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. 4న స్వగ్రామం సత్యసాయి జిల్లా ధర్మవరం వెళ్తున్నానని చెప్పింది. తర్వాత ఆచూకీ తెలియలేదు. దీంతో వీరేశ్శనివారం నేరేడ్మెట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
తొమ్మిదో తరగతి విద్యార్థి..
మేడ్చల్, వెలుగు: ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ పీఎస్పరిధిలోని జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ లో కార్తీక్ తొమ్మిదో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. 8 రోజుల క్రితం స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ చితకబాదారని, అప్పటినుంచి కార్తీక్కనిపించడం లేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆరోజే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెతుకుతున్నా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదని కంటతడి పెట్టారు.
