బాధితులకు రికవరీ ఫోన్లు అందజేత

బాధితులకు రికవరీ ఫోన్లు అందజేత

శంషాబాద్, వెలుగు : చోరీ, మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను  బాధితుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పీఎస్ పోలీసులు ట్రేస్ చేశారు. సుమారు 30 మొబైల్స్ ను డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాధితులకు అప్పగించారు. అనంతరం డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ..

శంషాబాద్ పరిధిలో ఎవరిదైనా ఫోన్ చోరీ,  మిస్సింగ్ అయిన వెంటనే పీఎస్ లో కంప్లయింట్ చేయాలని సూచించారు. ఫోన్ ఐఎంఐ నంబర్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ లను పోలీసులకు ఇస్తే  సీఐ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను ట్రేస్ చేసి  బాధితులకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.