తాతా మధును డిస్మిస్ చేయాలి: మాల సంఘాల ఐక్యవేదిక డిమాండ్

తాతా మధును డిస్మిస్ చేయాలి: మాల సంఘాల ఐక్యవేదిక డిమాండ్

ట్యాంక్ బండ్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించడం సిగ్గుచేటని మాల సంఘాల ఐక్య వేదిక మండిపడింది. ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని డిమాండ్ చేసింది. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, మాల ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజు ఉస్తాద్ అధ్యక్షతన మంగళవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా చెన్నయ్య, రాజు ఉస్తాద్, హరికృష్ణ, బేర బాలకిషన్, దాసరి విశాల్, మంచాల లింగస్వామి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అగ్రకుల అహంకారంతో దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారికి చట్టసభల్లో ఉండే నైతిక హక్కు లేదన్నారు. ఇద్దరినీ బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాల జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆవుల సుధీర్, మన్నె శ్రీధర్, నాందేవ్, శంకర్, జంగా శ్రీను, సర్వయ్య, సుధమల్ల అంజలి తదితరులు పాల్గొన్నారు. 

స్పీకర్‌‌‌‌‌‌‌‌ను పార్టీలకతీతంగా చూడాలి 
నారాయణగూడ: శాసనసభ స్పీకర్‌‌‌‌‌‌‌‌ పదవిలో ఉన్న వ్యక్తిని పార్టీలకతీతంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. అసెంబ్లీని హుందాగా నడిపిస్తున్న స్పీకర్‌‌‌‌‌‌‌‌ కంటతడి పెట్టడం బాధాకరమన్నారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మంగళవారం నారాయణగూడలో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిల విడుదల కోసం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను సీఎం తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు నిఖిల్ పటేల్, పర్లగొళ్ల మోడీ రాందేవ్, నరేశ్​ తదితరులున్నారు.

మధును బర్తరఫ్​ చేయాలి
వికారాబాద్: స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్​ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి బర్తరఫ్​చేయాలని వికారాబాద్​మున్సిపల్ చైర్​పర్సన్ గడ్డం అనన్య డిమాండ్​చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్​శ్రేణులతో కలిసి మంగళవారం వికారాబాద్​పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీశ్​రావు క్షమాపణలు చెప్పాలన్నారు. తన తండ్రి మచ్చలేని నాయకుడిగా స్పీకర్ స్థాయికి ఎదిగారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు ధారా సింగ్ జాదవ్,  వికారాబాద్, మర్పల్లి, ధారూర్ మార్కెట్​ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్​ ముదిరాజ్, మహేందర్​రెడ్డి, విజయభాస్కర్​రెడ్డి, మున్సిపల్​వైస్​చైర్మన్​అర్ధ సుధాకర్ ​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.