స్వీపర్లు లేక టీచర్లే స్కూల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నరు

స్వీపర్లు లేక టీచర్లే స్కూల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నరు

స్కూల్స్‌‌‌‌ క్లీనింగ్ ఎట్ల..?

స్వీపర్లను తొలగించిన సర్కారు

పంచాయతీ సిబ్బందికి బాధ్యతలు

పారిశుద్ధ్య పనులకే టైం సరిపోవడం లేదంటున్న కార్మికులు

విధిలేక టీచర్లే క్లీన్‌‌‌‌ చేసుకుంటున్నరు

గద్వాల, వెలుగు: స్కూళ్లను క్లీనింగ్ చేసే స్వీపర్లను తొలగించడంతో స్కూళ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి.  సర్కారు ఈ బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పజెప్పినా వారికి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకే టైం సరిపోవడం లేదని చెబుతున్నారు.  దీంతో స్కూళ్లు చెత్తాచెదారంతో దర్శనం ఇస్తున్నాయి. చేసేదిలేక కొన్నిచోట్ల టీచర్లే క్లీన్ చేసుకుంటున్నారు.  కరోనా నేపథ్యంలో ప్రస్తుతం తాము మాత్రమే వస్తున్నామని,  స్టూడెంట్ల రావడం ప్రారంభం అయితే పరిస్థితి ఏంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

544 మంది స్వీపర్ల తొలగింపు..

సర్కారు  గద్వాల జిల్లాలోని స్కూళ్లలో  544 మంది స్వీపర్లను తొలగించింది. ఇందులో  కేటి దొడ్డి మండలంలో 40, ధరూర్ లో 46, గద్వాలలో 85, ఇటిక్యాల లో 68, మల్లకల్ లో 40, గట్టు లో 60, ఐజ లో 60, రాజోలిలో 32, వడ్డేపల్లి లో 39, ఉండవల్లిలో 32, అల్లంపూర్ లో 42 మంది ఉన్నారు.  వీరికి   స్టూడెంట్  స్ట్రెంత్  బట్టి   2,500 రూపాయల వరకు శాలరీ వచ్చేది.   కానీ 2020-–21 విద్యా సంవత్సరానికి  విధుల్లోకి తీసుకోకపోవడంతో వాళ్లంతా ఉపాధి కోల్పోయారు.

ఎలా బతకాలి

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు  కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు గాని, ఉన్న ఉద్యోగాలు తొలగిస్తుండడంపై  స్వీపర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వచ్చేదే తక్కువ జీతం.. అందులోనూ కరోనా ఎఫెక్ట్‌‌‌‌ ఉన్నది.. ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వారంతా కూలీ పనులు చేసుకుంటున్నారు.  తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

అస్తవ్యస్తంగా స్కూళ్లు

స్వీపర్లను తొలగించడంతో స్కూళ్లు అస్తవ్యస్తంగా దర్శనం ఇస్తున్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి.  క్లాస్‌‌‌‌ రూములు అయితే దుమ్ము పేరుకుపోయి, బూజు పట్టి కనిపిస్తున్నాయి. సైన్స్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ రూంలను కూడా క్లీన్‌‌‌‌ చేయకవడంతో పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉందని టీచర్లు చెబుతున్నారు. పంచాయితీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా రావడం లేదరి, ఊళ్లో చెత్త ఎత్తేందుకు టైం సరిపోవడం లేదని
చెబుతున్నారని.. వాపోతున్నారు.

అన్యాయంగా తొలగించారు

చాలీచాలని జీతాలతో పని చేస్తున్న మమ్మల్ని అన్యాయంగా తొలగించారు. సర్కారు డబ్బులు సరిపోకపోయినా.. అన్ని పనులు చేసేవాళ్లం. స్కూల్‌‌‌‌లో చెత్తాచెదారంతో పాటు టాయిటెట్లు, బాత్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ క్లీన్‌‌‌‌ చేసేవాళ్లం.    సర్కారు స్పందించి మాకు న్యాయం చేయాలి.

– లాలన్న, భీంపురం

For More News..

కేకే బిడ్డ గెలిచింది.. సుభాష్‌ రెడ్డి భార్య ఓడింది

గ్రేటర్​లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్