మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు ఖాయం:అర్షదీప్ సింగ్

మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు ఖాయం:అర్షదీప్ సింగ్

వన్డే, టీ20ల మధ్య పెద్దగా తేడా లేదని అనుకుంటున్నట్లు టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ అన్నాడు. వన్డేలు, టీ20లు అయినా.. గతంలో కంటే తాను బౌలింగ్ లో మెరుగైనట్లు చెప్పాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎటాకింగ్ గా బౌల్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చివర్లో డిఫెండింగ్ చేస్తున్నానని తెలిపాడు. అంతిమంగా వికెట్లు తీయడమే లక్ష్యమన్నాడు. కాబట్టి రెండు ఫార్మాట్లలో తేడాతో ఉంటుందని తాను అనుకోవట్లేదన్నాడు. ఏ ఫార్మాట్ అయినా అత్యత్తుమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తానన్నాడు. 

వాతావరణం మన చేతుల్లో లేదు..

మైదానంలో మెరుగైన ప్రదర్శన చేయడం తప్ప వాతావరణాన్ని కంట్రోల్ చేయగల శక్తి ఏ జట్టుకు ఉండదని అర్షదీప్ సింగ్ అన్నాడు. అవకాశం దొరికితే మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేయడం ముఖ్యమని చెప్పాడు. వాన వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే ..తిరిగి ఆట ఎప్పుడు ప్రారంభమైనా..శారీరకంగా సిద్దమై ఉండాలన్నాడు. తాము అనుకున్న ప్లాన్ ను అమలు చేయడమే లక్ష్యంగా ఆడతామన్నాడు. 

ప్రదర్శన చేయడం వరకే నా పని..

టీమిండియాలో సుస్థిర స్థానం ఏర్పరచుకోవడం కష్టమని అర్షదీప్ సింగ్ అన్నాడు. మెరుగైన ప్రదర్శన చేస్తే మాత్రం జట్టులో ఖచ్చితంగా చోటు దక్కుతుందని తాను నమ్ముతానన్నాడు.  కానీ భారత్ కు ప్రాతినిధ్యం వహించినప్పుడు మాత్రం ఆస్వాదిస్తానని చెప్పాడు. 

రెండు మ్యాచ్ రద్దు..

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఇక రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో...12.5 ఓవర్లలో  స్కోరు 89/1 ఉండగా..వాన రావడంతో మ్యాచ్ రద్దు చేయబడింది.