లంకపై గెలుపుతో టీమిండియా అరుదైన రికార్డ్

లంకపై గెలుపుతో  టీమిండియా అరుదైన రికార్డ్

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 216 పరుగుల టార్గెట్ను  43.2 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ను భారత జట్టు 2-0తో దక్కించుకుంది. ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. 

స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా ఇప్పటి వరకు 26 వన్డే సిరీస్లు ఆడింది. వీటిల్లో 22 సిరీస్లలో భారత జట్టే గెలిచింది. మరో 4 సిరీస్లు డ్రా అయ్యాయి. అయితే 26 వన్డే సిరీస్లలో శ్రీలంక ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. దీంతో స్వదేశంలో లంకపై ఒక్క వన్డే సిరీస్ కూడా ఓడిపోని రికార్డును టీమిండియా నెలకొల్పింది. 

రెండో వన్డేలో గెలుపుతో టీమిండియా మరో  ఘనతను అందుకుంది. వన్డేల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా చరిత్రకెక్కింది. శ్రీలంకపై భారత్‌కు ఇది 95వ విజయం కాగా.. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 95 వన్డేల విజయాల రికార్డును భారత్ సమం చేసింది.