బంగ్లాపై భారత్ విక్టరీ..అంధుల టీ20 వరల్డ్ కప్ కైవసం

బంగ్లాపై భారత్ విక్టరీ..అంధుల టీ20 వరల్డ్ కప్ కైవసం

అంధుల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 120 పరుగుల తేడాతో గెలిచి మూడో సారి టైటిల్ను దక్కించుకుంది. 278 పరుగుల టార్గెట్ను చేధించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 157 పరుగులే చేసి ఓడిపోయింది. 

భారత్ భారీ స్కోరు..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో  మొదట బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 2 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఓ దశలో  29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ను కెప్టెన్ అజయ్ కుమార్, సునీల్ రమేష్  ఆదుకున్నారు. మూడో వికెట్కు 247 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. అజయ్ కేవలం 50 బంతుల్లో 100 నాటౌట్, సునీల్63 బంతుల్లో 136 నాటౌట్గా నిలిచారు. ఆ తర్వాత 278 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులే చేసి ఓడిపోయింది. భారత్ బౌలర్లు లలిత్ మీనా, అజయ్ కుమార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.