కష్టాల్లో టీమిండియా.. వీళ్లు నిలబడితేనే గెలుపు..!

కష్టాల్లో టీమిండియా.. వీళ్లు నిలబడితేనే గెలుపు..!

పుణే వేదికగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్ లో లంక జట్టు 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే టార్గెట్ ఛేజింగ్ లో టీమిండియా మాత్రం  ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్‌ జోష్‌గానే ఆడిన ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (2) ఆ తరువాత ఓవర్లో వెనుదిరిగారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కొత్త కుర్రాడు త్రిపాఠి(5) ఫోర్ కొట్టి మంచి స్కోర్ చేస్తాడెమో అని ఆశిస్తే వెంటనే ఔటై నిరాశపరిచాడు. దీంతో తక్కువ స్కోర్ కే భారత్‌ మూడు కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆ తరువాత వచ్చి క్రీజ్ లో సెట్ అయినట్టు కనిపించిన  కెప్టెన్‌ పాండ్య (12) కూడా వెనుదిరిగాడు.  ప్రస్తుతం భారత్ 5 ఓవర్లకు గానూ 35  పరుగులు చేసింది. క్రీజ్ లో దీపక్ హుడా (1*), సూర్యకుమార్‌ (0*) ఉన్నారు. వీరి మీదనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఇద్దరు క్రీజ్ లో పాతుకుపోతే టీమిండియాకు విజయం దక్కుతుందని భావిస్తున్నారు. కాగా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ఫస్ట్ టీ20 మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ లో ముందంజలో ఉంది.