మూడో టీ20లో భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం

మూడో టీ20లో భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం

మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 229 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంకే.. భారత బౌలర్ల ధాటికి కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను శ్రీలంక 2–1తో దక్కించుకుంది. 

టపటపా..

అంతకుముందు 229 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. అయితే కుషాల్ మెండీస్ ను అక్షర్ పటేల్ ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ ను అందించాడు. ఆ వెంటనే నిస్సంకను అర్షదీప్ సింగ్ పెవీలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో ఫెర్నాండో ఔటవడంతో..లంక 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ధనంజ యడిసిల్వ, చరిత్ అసలంక, దసున్ శనక కాసేపు మెరుపులు మెరిపించే ప్రయత్నం చేశారు. కానీ భారత బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో లంక వరుసగా వికెట్లను కోల్పోయింది.దీంతో 16.4 ఓవర్లలోనే శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా..పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 

 

ఉతికారేశారు..


టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ విజృంభించారు. లంక బౌలర్లను ఉతికారేసిన భారత బ్యాటర్లు..ప్రత్యర్థికి  225 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ఆరంభంలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి..గిల్తో కలిసి చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. సిక్సులు ఫోర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే 16 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. అయితే కరుణరత్నే బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. అప్పటికే భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులే చేసింది. 

 సూర్యకుమార్ సెంచరీ..

త్రిపాఠి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. లంక బౌలర్లను ఎడా పెడా బాదిపడేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 46 పరుగులు చేసిన గిల్ ఔటైనా సూర్య తగ్గలేదు. ఆ తర్వాత పాండ్యా, దీపక్ హుడా వరుసగా పెవీలియన్ చేరినా..సూర్య తన జోరును కొనసాగించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉండటం విశేషం. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ 9 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో..భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశనక రెండు వికెట్లు తీసుకోగా..కసున్ రజిత, చమిక కరుణరత్నే, వనిందు హసరంగ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

https://twitter.com/BCCI/status/1611742660636872705