హెల్త్ కార్డుల డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌పై ఆందోళన వద్దు : మారం జగదీశ్వర్

హెల్త్ కార్డుల డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌పై ఆందోళన వద్దు : మారం జగదీశ్వర్

హైదరాబాద్, వెలుగు: హెల్త్ కార్డుల డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఎన్ఈహెచ్ఎస్)  ట్రస్ట్ బోర్డు చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు డేటా బదిలీ చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు జరిగాయని వివరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారని జగదీశ్వర్ వెల్లడించారు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చెందవద్దని సూచించారు.

డేటాలో మరణించిన వారి పేర్లు, పాత అడ్రస్‌‌‌‌లు, పాత ఫోటోలు రావడం వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. కార్డులో స్వల్ప మార్పులు చేసి మరింత మెరుగ్గా రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మిగిలిన ఆసుపత్రుల్లోనూ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డుతో పాటు నెట్‌‌‌‌వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులతో ప్రభుత్వం ఈ నెల 20న కీలక సమావేశం  నిర్వహించనుందని తెలిపారు.