బషీర్‌బాగ్, వెలుగు: గోర్ బంజారాల సంప్రదాయ పండుగ ‘తీజ్’ను దేశవ్యాప్తంగా ఒకే సమయంలో నిర్వహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గోర్ సిక్వాడి సామాజిక ఉద్యమ ప్రతినిధులు కోరారు. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి 27 వరకు తీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ష్ట్రీయ గోర్ సేన భారత్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్‌తో కలిసి అటమీ నాయక్ పురుషోత్తం, లావుటియా అంబర్‌సింగ్ మాట్లాడారు. సింధు నాగరికతకు పూర్వం నుంచే గోర్ బంజారా సమాజం తీజ్ పండుగను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
