బెంగళూరు: బెంగళూరు ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో బుధవారం అమానుష ఘటన జరిగింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న 19 ఏళ్ల రేణుక అనే యువతి దారుణానికి ఒడిగట్టింది. రోజూలానే బుధవారం కూడా డ్యూటీకి వెళ్లిన రేణుక టాయ్లెట్కు వెళ్లింది. ఆమె టాయ్ లెట్లో ఉండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనిచ్చింది.
పెళ్లి కాకుండా బిడ్డ పుట్టిందన్న విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన రేణుక.. అప్పుడే పుట్టిన పసికందును గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత పసికందు మృతదేహాన్ని డస్ట్బిన్ కవర్లో పెట్టేసి టాయ్ లెట్ నుంచి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది.
కంపెనీలో పనిచేస్తున్న మరొక ఉద్యోగిని అదే టాయ్లెట్కు వెళ్లిన సమయంలో ఆ టాయ్లెట్లో అనుమానాస్పదంగా ఒక డస్ట్ బిన్ కవర్ కనిపించడంతో కంపెనీలో సిబ్బందికి తెలిపింది. కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ కవర్ను తీసి చూడగా పసికందు మృతదేహం కనిపించింది.
►ALSO READ | ఇలా ఉన్నారేంట్రా.. చీర బదులు నైటీ ధరించిందని భార్యకు నిప్పంటించేశాడు !
ఆ శిశువును పుట్టాక చంపేసినట్లు.. గొంతుపై ఉన్న గాయం చూసి హత్యగా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఆ మహిళను రేణుకగా గుర్తించారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. అయితే.. ఆమె గర్భం గురించి తల్లిదండ్రులకు తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

